కృతి శెట్టికి కొత్త టెన్షన్ పెట్టిన నితిన్

సినిమాల్లో హీరోయిన్ గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. టాలీవుడ్ లో ‘ఉప్పెన’తో తెరంగేట్రం చేసిన హీరోయిన్ కృతి శెట్టికి ఈ మూడు పుష్కలంగానే ఉన్నాయి. ఉప్పెన తరువాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ చిత్రాల్లో నటించిన కృతి శెట్టి హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకోవడంతో ఆమెది గోల్డెన్ లెగ్ అని అందరూ భావించారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్కు పరిచయమైన హీరోయిన్లలో కృతి శెట్టి లాగా వరుస హిట్లతో దూసుకుపోయిన హీరోయిన్ మరొక లేరు అని కూడా అనుకున్నారు.

అందుకు తగ్గట్లుగానే హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతి శెట్టి వరుసగా మరో మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేసింది. అయితే అనూహ్యంగా ఈ అమ్మడు తాజాగా నటించిన రెండు చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. రామ్ కు జోడీగా ఆమె నటించిన ‘ది వారియర్’ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో, లింగుసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కృత్తి శెట్టికి ఫస్టు ఫ్లాప్ వచ్చింది. ఇక నితిన్ తో ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా నిరాశపరిచింది.

మొదటి రోజు నుంచే ఈ సినిమా నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. పాత్రపరంగా కృతికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ, కథాకథనాలు రోటీన్ గా ఉండడంతో ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కృతి శెట్టికి టెన్షన్ మొదలైంది. ఈ ఫ్లాప్ తో కత్తి శెట్టిని నితిన్ టెన్షన్ లో పడేసినట్లయింది. దీంతో, ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ ఆశలన్నీ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ పైనే ఉన్నాయట. వరుసగా రెండు ఫ్లాట్లతో దిగాలు పడుతున్న కృతి శెట్టి ఇంద్రగంటి సినిమా పైనే గంపెడాశలు పెట్టుకుందట. మరి ఈ చిత్రం కృతి శెట్టికి హిట్ ఇస్తుందా లేక హ్యాట్రిక్ ఫ్లాప్ ఇస్తుందా అన్నది తేలాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.

The post కృతి శెట్టికి కొత్త టెన్షన్ పెట్టిన నితిన్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this