లైగర్ కోసం విజయ్ అంత తీసుకున్నాడా?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, విలక్షణ దర్శకుడు పూరి జగన్నాథ్ ల కాంబోలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా బాక్సర్ గా నటిస్తున్న విజయ్ దేవరకొండ లుక్ కు యూత్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆగస్టు 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నా రౌడీ హీరో తాజాగా ఆ చిత్రం నుంచి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. లైగర్ సినిమాలో తొలిసారిగా తను నత్తి పాత్రలో నటించానని, ఆ పాత్ర చేయడానికి తాను చాలా కష్టపడ్డానని రౌడీ హీరో చెప్పుకొచ్చాడు. ఒక పక్క బాక్సర్ గా సీరియస్ రోల్ చేస్తూ, మరోపక్క లవర్ కు ఐ లవ్ యు అని కూడా చెప్పడానికి ఇబ్బంది పడే పాత్రలో నటించడం ఛాలెంజింగ్ గా ఉందని అన్నాడు.

ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ అద్భుతంగా నటించారని కితాబిచ్చాడు రౌడీ హీరో. మరోవైపు ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ తో నటించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని విజయ్ దేవరకొండ చెప్పాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా తన చెంపపై మైక్ టైసన్ కొట్టిన దెబ్బ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నాడు. ఆ దెబ్బకు ఒక రోజంతా నొప్పితో చాలా బాధపడ్డానని విజయ్ చెప్పుకొచ్చాడు.

బాక్సింగ్ స్టార్ అయిన మైక్ టైసన్ తో నటించడానికి ముందు కొంత ఆందోళన చెందానని, కానీ ఆయనతో నటించడం అలవాటు అయిన తర్వాత అదో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిందని అన్నాడు. లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్ వస్తోంది దాదాపుగా రూ.35 కోట్ల పారితోషకం తీసుకున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి.

The post లైగర్ కోసం విజయ్ అంత తీసుకున్నాడా? first appeared on namasteandhra.

Thanks! You've already liked this