లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్న మూవీ లైగర్. టాలీవుడ్ ‘రౌడీ’ ఇమేజ్ తో అందరినీ ఆకట్టుకున్న విజయ్ దేవరకొండకు నార్త్ లో ఎంతటి పాపులార్టీ ఉందన్న విషయం ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అతగాడికి సాదాసీదా అభిమానులే కాదు సెలబ్రిటీలు.. హాట్ బ్యూటీస్ కూడా అతడి మీద తమకున్న అభిమానాన్ని చెప్పిన విషయం తెలిసిందే.

ఇక.. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అయితే.. విజయ్ దేవరకొండ మీద తనకున్న క్రష్ ను చెప్పేందుకు పెద్దగా మొహమాటపడలేదు.
అలాంటిది ఆమెతో విజయదేవరకొండ జత కడితే..? ఆ ప్రాజెక్టుకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. నిజానికి లైగర్ మూవీలో అనన్య పాండేకు ముందు అనుకున్న హీరోయిన్ జాన్వీకపూర్ అన్న కొత్త విషయాన్ని వెల్లడించారు  పూరీ.

పాన్ ఇండియా మూవీ లైగర్ ను పూరీ కనెక్ట్స్ తో పాటు ధర్మ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించిన వైనం తెలిసిందే. వచ్చే వారం (ఆగస్టు 25) విడుదల కానున్న ఈ మూవీకి మొదట విజయ్ సరసన జాన్వీ కపూర్ ను తీసుకోవాలని అనుకున్నామని.. అందులో భాగంగా ఆమెను సంప్రదిస్తే.. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవటంతో ఆమె ఈ సినిమాలో మిస్ అయినట్లు చెప్పారు పూరీ.

జాన్వీకి కుదరదన్న తర్వాత కథ విన్న కరణ్ జోహార్ అనన్య పాండేను తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. ఇక.. తాను చెప్పిన రెండు కథల్లో లైగర్ లైన్ కు విజయ్ ఓకే చెప్పినట్లు వెల్లడించారు. లైగర్ ఐడియాను చెప్పినంతనే విజయ దేవరకొండ ఎంతో ఆసక్తి  చూపించాడని..తాను చెప్పిన రెండు కథల్లో మొదట దీన్ని చేయాలని చెప్పినట్లు చెప్పారు.

The post లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న జాన్వీ కపూర్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this